అప్పన్న సన్నిధిలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ దంపతులు
అక్షర కిరణం, (విశాఖపట్నం): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ దంపతులు బుధవారం దర్శిం చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు నాదస్వర మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛా రణలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ దంపతులు ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, తదుపరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనానం తరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందిం చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు స్వామివారి శేషవస్త్రంతో కలెక్టర్ దంపతులను సత్కరించి, స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం 29న గుడి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించారు.