సాలూరు ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి పదవ తరగతి విద్యార్థి మృతి
Åకన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు Åభయభ్రాంతులైన విద్యార్థులు Åవిద్యాశాఖ అధికారుల విచారణ
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు ఉన్నత పాఠశా లలో ప్రహరీ గోడ కూలి పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి తుపాకుల అరుణ్ తేజ అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ప్రహరీ గోడ కూలి అరుణ్ తేజ మీద పడడంతో విద్యార్థి తీవ్రంగా గాయ పడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. గ్రౌండ్‌కు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు విద్యార్థులు చెబుతున్నారు. మృతి చెందిన అరుణ్ తేజ సాలూరు పట్టణంలోని రెల్లివీధిలో నివాసం ఉంటున్నాడు. ఈ సంఘట నతో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంతవరకు ఆడి పాడిన సహచర విద్యార్థి అనుకోని సంఘటనతో మృతి చెందడంతో తోటి విద్యార్థులు ఒక్క సారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు గోడ ఎందుకు కూలిపోయింది? గోడ నిర్మాణంలో నాణ్యతా లోపమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఉపాధ్యా యుల నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో ఇప్పుడు విద్యాశాఖ అధికారులు, పోలీసులు విచారణ చేస్తున్నారు. బడికి వెళ్లిన కుమారుడు అరుణ్ తేజ ఇలా మృతి చెందడంతో అతడి తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు.