పైడితల్లమ్మ వారి వేషధారణలో
చిన్నారి హాశ్రీ
మొక్కు చెల్లించుకున్న చిన్నారి
అక్షర కిరణం, (విజయనగరం): ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ జాతర ఈనెల 14 ,15 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా అందరూ పైడితల్లమ్మను పూజిస్తారు. ఈక్రమంలో హిందీ ఉపాధ్యా యుడు ఏలూరి శ్రీనివాసరావు, సత్యవతిల కుమార్తె చిన్నారి హాశ్రీ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది. హాశ్రీ పైడితల్లి అమ్మవారి వేషధారణతో అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది. అందరు చిన్నారికి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా హాశ్రీ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సత్యవతి మాట్లాడుతూ భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మ వేషధారణతో తమ కుమార్తె మొక్కులు చెల్లించుకున్నట్టు తెలిపారు.