టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన చంద్రబాబు
అక్షర కిరణం, (అమరావతి): మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత ప్రారంభించారు. సభ్యత్వ నమోదులో భాగంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రూ.100 కట్టి సీఎం చేతుల మీదుగా మ్నెదటి సభ్యత్వాన్ని తీసుకున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలని శుక్రవారం నాడు సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈమేరకు నేడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. రూ.100లు కట్టి సభ్యత్వం తీసుకుంచే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ప్రమాద బీమా వర్తిస్తుంది. రూ.లక్ష కడితే పార్టీలో శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. ప్రమాదవశాత్తూ చనిపోతే మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు తక్షణసాయం అందజేస్తారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్థికసాయం అందిస్తారు.