ఏపీలో గ్రామీణ సంస్థలకు రూ.988.773 కోట్ల కేంద్రం నిధులు
15వ ఆర్థిక సంఘం సిఫార్సుతో విడుదల
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ నిధులను అందించింది. 9 జడ్పీలు, 615 మండల పంచాయతీలు, 12,853 గ్రామ పంచాయతీలకు ఈ నిధులు అందిస్తారు. గ్రామాల్లో అత్యవసర సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులు వెచ్చించుకోవచ్చు. జీతాలు, పరిపాలన ఖర్చుల కోసం ఈ నిధులను వాడకూడదు. కేంద్రం నిధులు విడుదల చేయడంపై ఏపీలో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.