నిబంధనలు ఉల్లంఘించిన 15 స్కూల్ బస్సులపై కేసులు
అక్షర కిరణం, (విశాఖపట్నం): నిబంధనలు ఉల్లంఘించిన 15 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు. తగరపువలస, పద్మనాభం, మద్దిలపాలెం, గాజువాక ప్రాంతాల్లో స్కూల్ బస్సులు, ఆటోలపై ఈనెల 13 నుంచి నేటి వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో 115 కేసులు నమోదు చేసి పది బస్సులను సీజ్ చేసినట్టు వివరించారు. అదేవిధంగా 46 ఆటోలపై కేసులు నమోదు చేసి ఐదు ఆటోలను సీజ్ చేశామని చెప్పారు. తనిఖీల్లో ఎంవీఐలు రంగారావు, ఏఎంవీఐలు అనిల్‌కుమార్, సుమన్‌కుమార్, శిరీష దేవి, సృజన తదితరులు పాల్గొన్నారని డీటీసీ రాజారత్నం తెలిపారు.