రూ.641 కోట్లతో నెరడి బ్యారేజీ పూర్తికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Åసీఎంకు మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు
అక్షర కిరణం, (శ్రీకాకుళం): ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను దశాబ్దాలుగా వేధిస్తున్న వంశధార నీటి వివాదానికి స్వస్తి పలుకుతూ నేరడి బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 641 కోట్లు మంజూరు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు సాధనకై ఆయన నిరంతర పట్టుదలతో కృషి చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.641 కోట్లతో నెరడి బ్యారేజీ పూర్తి చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. దీని వల్ల దశాబ్దాల నాటి వంశధార చిక్కుముడులు విప్పి చారిత్రాత్మక గెజిట్ సాధన సాకారమైందన్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. ఏడాదిలోగా 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఇవ్వనున్నదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈసందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.