ఏపీలో 9మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నిలకు పోస్టింగ్ లు ఇచ్చింది. కాంతిరాణాను ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్‌సేఫ్టీ ఐజీగా నియమించింది. విశాల్ గున్నికి ట్రైనింగ్ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. రెండు కొత్త జిల్లాలకు ఎస్పీలను నియ మించారు.. పల్నాడు జిల్లాకు కూడా ఎస్పీని నియమించా రు. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని కూడా బదిలీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు.. 9 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీఎఫ్ డీజీగా ఉన్న సీహెచ్ త్రివిక్రమ వర్మకు ఎఫఎసఎల్ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న జయలక్ష్మిని సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా బదిలీ చేశారు. ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా ఉన్న బి.రాజకుమారి రైల్వే ఐజీగా నియమించారు. సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా రాజకుమారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కాంతి రాణా టాటాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ ఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న విశాల్ గున్నికి ట్రైనింగ్ డీఐజీగా పోస్టింగ్ దక్కింది. గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న బాబూజీ అట్టాను టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బదిలీ చేశారు.
ఏపీ ప్రభుత్వం ఈ బదిలీలలో కొత్తగా ఏర్పాటైన మార్కా పురం, పోలవరం జిల్లాలతోపాటుగా పల్నాడుకు నూతన ఎస్పీలను నియమించింది. పోలవరం ఓఎస్డీగా ఉన్న పంకజ్‌కుమార్ మీనాను మార్కాపురం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. సీఎంఎస్జీ ఎస్పీగా ఉన్న జగదీశ్ అదహళ్లిని పల్నాడు ఎస్పీగా బదిలీ చేశారు. సీఐడీ ఎస్పీ కె చక్రవర్తిని పోలవరం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. మార్కాపురం, పోల వరం జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయగా.. పూర్తిస్థాయిలో ఎస్పీలు లేరు. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలు ఇంఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు.
ఇటు పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన బి.కృష్ణారావు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ మూడు చోట్ల ఎస్పీలను నియమించారు.. అది కూడా 2020 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు పంకజ్‌కుమార్ మీనా (మార్కాపురం), కె.చక్రవర్తి (పోలవరం), జగదీష్ అడహల్లిలను (పల్నాడు) ఈ మూడు జిల్లాలకు ఎస్పీలుగా నియమించారు. అంతేకాదు వీరి ముగ్గురికి జిల్లా ఎస్పీలుగా ఇవే మొదటి పోస్టింగులు కావడం విశేషం. మొత్తం మీద కొత్త జిల్లాలకు ఎస్పీలను నియమించడంతో పాటుగా కాంతి రాణా టాటా , విశాల్ గున్నీలకు కరీాడా పోస్టింగ్ ఇచ్చారు.