సీఎంఆర్ అధినేత మావూరి వెంకట రమణకు టీజేఎఫ్ సభ్యుల సత్కారం
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): ప్రజా సేవకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, సీఎంఆర్ గ్రూప్ చైర్మన్ మావూరి వెంకట రమణకు తెలుగు జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) కోర్ టీమ్ చిరు సత్కారం చేసింది. టీజేఎఫ్ సభ్యులు టీజేఎఫ్ మెమెంటో అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం ఫౌండర్/ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి, ప్రధాన కార్యదర్శి భూపతి జార్జ్, విశాఖ జిల్లా సెక్రెటరీ పీటర్ ప్రదీప్, తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం గౌరవ సలహాదారులు చదలవాడ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.