ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం సమీక్ష
అక్షర కిరణం, (అమరావతి): ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం సమీక్ష శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకు న్నారు. కాగా గొట్టా బ్యారేజీ పరీవాహక ప్రాంతంలో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు నీటి నిల్వలు నమోదయ్యాయి. గొట్టా బ్యారేజీకి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద నమోదవుతుందని శ్రీకాకుళం కలెక్టర్ తెలిపారు. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 1.05 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలి పారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందాసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు పేర్కొ న్నారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వా లని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉత్తర ఆంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పై నుండి వచ్చే ప్రవాహాలతో నదులు నిండిపోతున్నాయని అధికారులు తెలి యజేశారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలి పోయాయి. పడిపోయిన చెట్లలో 90 శాతం తొలగించి నట్లు అధికారులు చెప్పారు.
ఉత్తర ఆంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు ఈపీ డీసీఎల్ అధికారులు వెల్లడిరచారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు శుక్ర వారం సాయంత్రం నాటికి అన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరు ద్ధరించాలని ఆదేశించారు.