వర్చువల్‌గా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కి సీఎం శంకుస్థాపన
అక్షర కిరణం, (విజయనగరం): పెట్టుబడులకు ఆకర్షితులు కావడమేకాక పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్‌గా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేశారు. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడలో 102 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించనున్న కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకు స్థాపన చేశారు. రాజాం తహసిల్దారు కార్యాలయం నుండి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, పారిశ్రామికవేత్త రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పారిశ్రామికవేత్త రామ్మోహనరావు ఇంట రాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరికంలో పుట్టి పెట్టుబడిదారీగా ఎదిగినందుకు రామ్మోహన్‌ను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ వంగర మండలం అరసాడలో నిర్మించనున్న బయోగ్యాస్ ప్లాంట్ 13.8 2 ఎకరాల స్థలంలో నిర్మించనున్నట్లు తెలిపారు. రామ్మోహన్ రావు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను బీటెక్‌లో గోల్డ్ మెడల్ సాధించానని, 2017లో విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో తమరి సమక్షంలో ఎంఓయూ జరిగిందని గుర్తు చేసారు. ఈబయోగ్యాస్ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా 5000 మంది రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, రాజాం, విజయనగరం ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్, అదితి గజపతిరాజు, పారిశ్రామికవేత్త పి.రామ్మోహన్రావు గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.