పామాయిల్ రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త
కటన్ను పామాయిల్‌కు రూ.19 వేలు
అక్షరకిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు రైతులకు సంబంధిం చి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం లో అన్నదాతలు ఎట్టి పరిస్థితుల్లోను నిర్లక్ష్యానికి గురికా కూడదని, ప్రకృతి విపత్తులవల్ల పంట నష్టపోకూడదని ఆయన భావిస్తున్నారు.
ఈక్రమంలోనే వారికి ప్రభుత్వం తరఫు నుంచి సహాయం అందేలా అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. ఈమేరకు అధికారులను కూడా ఆదేశించారు. తాజాగా పామాయిల్ సాగు చేసే రైతులకు స్థిరమైన ధరలు ఉండాలనే ఉద్దేశంతో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను పామాయిల్ ధర రూ.19వేలకు పెరిగింది. గతంలో ఇది రూ.12,500 మాత్రమే ఉండేది. నాలుగు నెలల్లోనే ఇంత ధర రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకనుంచి ఇదే ధర కొనసాగుతుందని అధికారులు చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక సందర్భంలో టన్ను పామాయిల్ ధర రూ.23వేలు పలికింది. ఇదే ధర కొనసాగుతుందని అన్నదాతలు ఆశించినప్పటికీ ఆ అవకాశం రాలేదు. పంట సాగుచేసే రైతులు ఎకరా పొలానికి లక్ష రూపాయల కౌలును అడ్వాన్స్ గా ఇవ్వడంతో రూ.12వేలకు తగ్గింది. దీనివల్లే అన్నదాతలు నష్టపోయారు.
టన్ను పామాయిల్ రూ.19వేలు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను పామాయిల్ రూ.19వేలకు పెరిగింది. అయితే ఈ ధర మరింత పెరుగుతుందని రైతులు భావిస్తున్నారు. పామా యిల్ సాగు చాలా తక్కువగా ఉందని, దీన్ని మరింత విస్తరించాలని అధికారులు అన్నదాతలకు సూచించారు. పామాయిల్ దిగుమతిపై ఉన్న సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచుతూ శుభవార్త చెప్పింది. దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచింది. దీనివల్ల పామా యిల్ రైతులకు మరింత లబ్ధి కలగనుంది. ఏపీలో పామా యిల్ సాగుచేస్తున్న రైతులకు గిట్టుబాటయ్యే స్థాయిలో మద్దతు ధర లభించడంపై వారంతా హర్షం వ్యక్తం చేస్తు న్నారు. భవిష్యత్తులో కూడా పామాయిల్ సాగును మరింత విస్తరించాలని, వాటికి సంబంధించిన పరిశ్రమలను కూడా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకొని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.