గనుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష
అక్షర కిరణం, (అమరావతి): సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానం పైనా సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గనుల శాఖతో రూ.3320 కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వివ రించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34 శాతం మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తుందని సీఎంకు అధికారులు తెలిపారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72 శాతానికి పైగా అదనపు ఆదాయం వస్తుందని ఈసందర్భంగా సీఎంకు అధికారులు స్పష్టం చేశారు.