సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అక్షర కిరణం, (అమరావతి): అమరావతి రాజధాని ప్రాంతంలో పూర్తయిన తొలి భవనం సీఆర్డీఏ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈపర్యటనలో భాగంగా ఏడు అంతస్తుల కాంప్లెక్స్‌లోని కార్యాలయాలను సీఎం పరిశీలించి అందుబాటులో ఉన్న మౌలిక సదు పాయాలను పరిశీలించారు. ఐజీబీసీ నెట్ జీరో ఎనర్జీ రేటింగ్ సిస్టమ్‌కు అనుగుణంగా భవన నిర్మాణాన్ని గుర్తించి ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నెట్ జీరో ఎనర్జీ (డిజైన్) సర్టిఫికేషన్ ఇచ్చింది. అనంతరం అమరావతి రాజధాని అభివృద్ధి పురోగతిపై సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అన్ని భవనాలను నిర్ణీత కాలవ్యవధీనంలో పూర్తి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధికి తమ భూములను విరాళంగా ఇచ్చిన రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే టి.శ్రవణ్ కుమార్‌లకు అప్పగించారు. రైతులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు చేసుకోవాలని ముగ్గురు నేతలను కోరారు. అవసరమైతే వ్యక్తిగతంగా జోక్యం చేసుకుంటానని హామీ ఇచ్చారు.