విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
î1141 ఎంవోయÖలు, రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నంలో సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు.. ముఖ్యమంత్రి చంద్ర బాబు, డిప్యూటీ సీఎ: పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజర య్యారు. ఈ సదస్సు ప్రారంభానికి ముందు ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, వివిధ కళాకృతులు, ఉత్పత్తులను ఆసక్తిగా తిలకిం చారు. గురు, శుక్రవారాల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 141 ఎంవోయూలతో రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయంటు న్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (్పుII Paతీtఅవతీsష్ట్రఱజూ Suఎఎఱt) ప్రారంభ మైంది. ఈ సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్య మంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తోపాటుగా.. ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రా మికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సు ప్రాంగణంలో థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌లకు స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాసేపు డోలు వాయించి ఉత్సాహపరి చారు.. కళాకారులతో ఫొటోలు దిగి పారిశుద్ధ్య కార్మికులతో మాట్లా డారు. ఆ తర్వాత ఏపీ పెవిలియన్, ఎంఎసఎంఈ పెవిలియన్లను పీయూష్ గోయల్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రారంభిం చారు. అంతకముందు సీఐఐ 31వ పార్టనర్షిప్ సమ్మిట్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వక భేటీ అయ్యారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తున్న ప్రయత్నా లను అభినం దించిన పవన్ కళ్యాణ్.. ఏపీకి పారిశ్రామిక ప్రగతి దిశగా ఇదే వేగం కొనసాగాలని ఆకాంక్షించారు. ఇటు విశాఖపట్నం ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న సదస్సులో వివిధ సంస్థలు ప్రభుత్వంతో 141 ఎంవోయూలు చేసుకోనుంది. మొత్తం రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు.. 2.46 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
ఈ సీఐఐ 31వ పార్టనర్షిప్ సమ్మిట్‌లో ఏపీ పెవిలియన్‌ను పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. పెట్టుబడుల అవకాశాలను తెలియజేసేలా భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీలో డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, సోలార్ పవర్, పౌర విమానయాన రంగాల్లో అభివృద్ధిని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. పారిశ్రామిక, పర్యాటక, క్లీన్ ఎనర్జీ పాలసీలను, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి అంశాలు.. పోర్టులు, హార్బర్లు, విమానయానం, రక్షణ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలు వివరించనున్నారు.
కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన రద్దు
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో పర్యటన రద్దైంది. అమిత్ షా విశాఖపట్నం సీఐఐ సదస్సుతోపాటు రాష్ట్రాల డీజీపీల సమావేశం, మహిళా సదస్సులకు హాజరుకావాల్సి ఉంది. కానీ ఆయన రాకపోవడంతో ఆ కార్యక్రమా లు రద్దయ్యాయి. మొత్తం మీద విశాఖపట్నంలో జరుగుతన్న ఈ సీఐఐ 31వ పార్టనర్షిప్ సమ్మిట్‌లో ఏపీకి భారీ పెట్టుబుడులు రానున్నాయి.