సీఎంఆర్ఎఫ్కు కెమిక డ్రగ్స్ కంపెనీ రూ.10 లక్షల విరాళం
అక్షర కిరణం, (పరవాడ): వరద బాధితుల సహా యనిధికి కెమిక డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమా న్యం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. రూ.10 లక్షల చెక్కును ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పి.మల్లారెడ్డి తరపున వైస్ప్రెసిడెంట్ కె.సాంబశివరావు బుధవారం సీఎం చంద్రబాబును విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వయంగా కలిసి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ల పిలుపుమేరకు వరద బాధితుల సహాయ నిధికి ఆర్థిక సహాయం అందజేశామని కంపెనీ యాజ మాన్యం తెలిపింది.
వరద బాధితుల సహాయార్థం కెమిక డ్రగ్స్ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కె.సాంబశివరావు, కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.