భోజనం వడ్డించడం ఆలస్యమైందని వదినను చంపిన మరిది
Åనిందితుడు కునాల్ కుమార్ అరెస్టు
అక్షర కిరణం, (బీహార్/జాతీయం): బీహార్లోని జహానా బాద్ జిల్లాలో ఘోరమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం పెట్టడంలో కాస్త ఆలస్యమైం దనే చిన్న విషయానికే విపరీతమైన కోపం తెచ్చుకున్న ఓ మరిది.. తన వదిననే గొడ్డలితో నరికి చంపేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఈ నిందితుడు.. అంతటితో ఆగకుండా నరికిన మహిళ తలను తెచ్చి ఇంటి ఎదుట ఉన్న ఒక చెట్టు కు వేలాడదీసి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఈ వికృత ఘటన స్థానికంగా తీవ్ర భయాం దోళనలను సృష్టించింది. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన పార్స్ బిగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఇమాద్పూర్ గ్రామానికి చెందిన ధర్మేంద్ర కుమార్ భార్య 25 ఏళ్ల అన్షు దేవి ఇంట్లోనే ఉంది. అయితే కుటుంబ సభ్యులు అందరూ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అయితే అన్షుదేవి మరిది అయిన కునాల్కుమార్ నేరుగా పొలం నుంచి ఇంటికి వచ్చాడు. తనకు తక్షణమే భోజనం పెట్టాలని వదిన ను కోరాడు. అయితే భోజనం వడ్డించడం కాస్త ఆలస్యం కావడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన కునాల్.. ఇంట్లోనే ఉన్న గొడ్డలి తీసుకు వచ్చి వదినపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. అప్పటికే అతడు గంజాయి సేవించి ఉండగా.. మత్తులో అతికిరాతకంగా ప్రవర్తించాడు. వదిన వద్దని వేడుకుంటున్నా వినకుండా ఆమె తలను నరికేశాడు.
అక్కడే కూర్చుండిపోయిన నిందితుడు
హత్య అనంతరం నరికిన తలను తెచ్చి ఇంటి ముందర ఉన్న చెట్టుకు వేలాడదీసిన నిందితుడు కునాల్.. అక్కడి నుంచి పారిపోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ప్రశాంతం గా తన ఇంటి సమీపంలోనే కూర్చుండిపోయాడు. ఈ ఘోరాన్ని గమనించిన గ్రామస్థులు పెద్ద సంఖ్యలో సంఘ టనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యంగా చెట్టుకు అన్షుదేవి తల వేలాడదీయడం చూసి విస్తుపోయారు. భయంతో విపరీతంగా వణికిపోతూనే.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
హత్యకు ఉపయోగించిన పదునైన గొడ్డలిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఫోరెన్సిక్ సిబ్బందిని పిలిపించి.. చెట్టుకు కట్టిన మహిళను కిందకు దింపించారు. ఆపై మొండం, తలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అయితే ఈ దారుణం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మత్తలో ఉండే కుమాల్ ఈ పని చేశాడని.. ఇంతటి దారుణానికి ఒడిగడతాడని తాము కలలో కూడా అనుకోలేదని కన్నీటిపర్యంతం అయ్యా రు. ఓవైపు కోడలు హత్య, మరోవైపు కొన్నకొడుకు హంత కుడు జైలుకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేక అతడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.