ఏవీఎన్ కాలేజ్‌లో గొంతు తెగిన అక్షరం పుస్తకావిష్కరణ
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): ఏవీఎన్ కళాశాలలో సహృదయ సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో యువకవి సిర్పి చంద్రశేఖర్ రచించిన గొంతు తెగిన అక్షరం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సింహాద్రి నాయుడు మాట్లా డుతూ చిన్న వయసులోనే కవిగా రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిన యువకవి చంద్రశేఖర్‌ను విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకోవాలని చంద్రశేఖర్ మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యఅతిథి శేఖర మంత్రి ప్రభాకర్ చంద్రశేఖర్ రచించిన ‘గొంతు తెగిన అక్షరం’ పుస్తకాన్ని ఆవిష్కరించి చిన్న వయసులో తన ప్రతిభను రచనలు, కవితలతో సమాజానికి చాటి చెప్పారన్నారు. మరో అతిథి డాక్టర్ డీవీ సూర్యరావు సమాజంలో యువ తరానికి స్ఫూర్తిదాయకంగా చంద్రశేఖర్‌ని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ సింహాద్రి నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, శంకర్ నారాయణరావు, స్వరాజ్యలక్ష్మి, తెలుగు విభాగాధిపతి వెంకటరత్నం అధ్యాపకులు డబ్భీరు గాయత్రి, నరసింహ మూర్తి, పైడి రజిని అధ్యాపక అధ్యాపకేతరులు పాల్గొన్నారు.