బాడీబిల్డింగ్ పోటీల్లో పలాస యువకుడి ప్రతిభ
అక్షరకిరణం, (పలాస): గుంటూరులో జరిగిన మిస్టర్ ఆంధ్ర జోనల్ మీట్ బాడీ బిల్డింగ్ పోటీల్లో బాడీ కేర్ ఫిట్నెస్ జిమ్ నుండి పాల్గొన్న ఆర్.గణేష్ (ధర్మపురం గ్రామం, పలాస) బాడీ బిల్డింగ్ కంపెటేషన్లో 60 కిలోల విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే మెన్స్ ఫిజిక్స్ లో 3వ స్థానాన్ని సాధించారు. గణేష్‌కు కోచ్‌గా నెయ్యల భాస్కరరావు వ్యవహరించారు. అలాగే ఈనెల ముంబైలో 20 నుండి 22 వరకు జరగనున్న నేషనల్ వైడ్ బాడీ బిల్డింగ్‌కి ఆర్.గణేష్ ఎంపికయ్యారు. గణేష్‌కు సపోర్టర్లుగా ఎన్.జోగారావు, పైల వేణుగోపాల్ రెడ్డి, సోమేశ్, అరుణ్, గౌతమ్, ఉమ, వంశీ, నాని, విజయ్, శశి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.