రోగికి వైద్యుడి రక్తదానం
ఆ నలుగురు ట్రస్ట్ చొరవతో రక్తదానం చేసిన డాక్టర్ శ్రీనివాసరావు
అక్షరకిరణం, (పలాస): రక్తం అవసరమైన ఓ రోగికి వైద్యుడు రక్తదానం చేసి ప్రాణాలు నిలిపారు. వివరాలిలా ఉన్నాయి. పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డోకులపాడు గ్రామానికి చెందిన తామాడ నారాయణమ్మకు రక్తం తక్కువగా ఉండడంతో డాక్టర్ సలహా మేరకు ఆ నలుగురు ట్రస్ట్‌ను సంప్రదించారు. ఆ నలుగురు ట్రస్ట్ సభ్యులు పలాస కిడ్నీ ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ పద్మజ, డాక్టర్ మోహన్‌బాబు సహకారంతో అదే ఆస్పత్రిలో ఆర్తో స్పెషలిస్ట్‌గా సేవలు అందిస్తున్న డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు స్పందించి ఏ నెగిటివ్ రక్తాన్ని దానం చేశారు. ఆయనను పేషెంట్ కుటుంబ సభ్యులతో పాటు ఆ నలుగురు ట్రస్ట్ సభ్యులు అభినందించారు.