విలువలతో కూడిన విద్యావ్యవస్థను నిలబెట్టిన ఇంద్రాణి
జయంతి సభలో కరస్పాండెంట్ భానోజీరావు
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): విలువలతో కూడిన విద్యా వ్యవస్థను నిలబెట్టేందుకు ఇంద్రాణి జగ్గారావు చేసిన కృషి మరువరానిదని ఏవీఎన్ కళాశాల వైస్ చైర్మన్, కరస్పాండెంట్ ఏవీ అదీప్ భానోజీరావు అన్నారు. దేశంలోనే వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్రలో గ్రామీణ మహిళల విద్యాబి óవృద్ధి కోసం తన తల్లి ఇంద్రాణి జగ్గారావు ఎంతగానో కృషి చేశారన్నారు. ఏవీఎన్ కళాశాల పూర్వ కరస్పాండెంట్, వైస్ చైర్పర్సన్ ఇంద్రాణి జగ్గారావు 90వ జయంతిని పురస్కరిం చుకొని కళాశాల ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్ర వారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిది óగా హాజరయ్యారు. భానోజీరావు మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం బాల్వాడీ కేంద్రాలు, క్రెష్ సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. విశాఖ నగరాభివృద్ధికి వివిధ సంస్థల ద్వారా సేవలందించడంతోపాటు లోక్‌అదాలత్ సభ్యురాలిగా ఎన్నో న్యాయ సమస్యలు పరిష్కరించారని పేర్కొన్నారు. గౌరవ అతిధిగా హాజరైన అలుమినీ అసోసియేషన్ పూర్వ అధ్యక్షు లు మాకెన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఏవీఎన్ కళాశాల విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో, వివిధ హోదాల్లో ఉన్నారన్నారు. రిసోర్స్‌పర్సన్ హాజరైన ఏఐఈ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, మోటివేషనల్ స్పీకర్ గోపికా చాగంటి మాట్లాడుతూ బాలికల విద్య, మహిళాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ఇంద్రాణి జగ్గా రావు చేసిన కృషి మరువరానిదన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సింహాద్రినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ఉమెన్ అసోసియేన్ అధ్యక్షురాలు ఎం.వి. భానుమతి, కార్యదర్శి డాక్టర్ అర్చన, ట్రెజరర్ సుస్మిత, ఉపాధ్యక్షురాలు కృష్ణకుమారి, డీన్ జి.శంకరనారాయణ, స్వరాజ్యలక్ష్మీ, పైడి రజని, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.