నెల రోజుల్లో రేవళ్లపాలెం టీడీఆర్లు
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
అక్షరకిరణం, (మధురవాడ): చాలాకాలంగా పెండిరగ్లో ఉన్న జీవీఎంసీ 6వ వార్డు రేవళ్లపాలెం టీడీఆర్ లను నెలరోజుల్లో అందజేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్తో కలిసి గురువారం రేవళ్లపాలెంలో పర్యటిం చారు. 2014- 19 మధ్యలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైవే నుంచి బక్కన్నపాలెం వెళ్లే మెయిన్ రోడ్డు విస్తరణ చేపట్టామని చెప్పారు. అక్కడక్కడ పెండిరగ్లో ఉన్న విస్తరణ పనులను అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పట్టించు కున్న పాపాన పోలేదని విమర్శించారు. రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చిన ఇళ్ల డెబ్రిస్ తొలగించకుండా స్థానికులు ఆందోళన చేసినా గత ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీఆర్లు మంజూరు చేసి సమస్య పరిష్క రిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నానని తెలి పారు. హైదారాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్ మాదిరిగా మధురవాడ ప్రాంతం శరవేగంతో అభివృద్ధి చెందుతోంద న్నారు. ప్రణాళిక ప్రకారం మౌలిక సౌకర్యాలు కల్పించకపోతే మురికివాడలు తయారవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై స్పందించి త్వరితగతిన పరిష్కారం చూపించిన సంపత్ కుమార్ లాంటి డైనమిక్ అధికారులు విశాఖకు అవసరమన్నారు. టీడీపీ వార్డు అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, జోన్ 1, 2 కమిషనర్లు కార్పొరేటర్లు మొల్లి హేమలత, లొడగల అప్పారావు, పిల్లా మంగమ్మ, కూటమి నాయకులు పంచకర్ల సందీప్, జీవన్ కుమార్, పిల్లా వెంకట్రావు, మొల్లి లక్ష్మణరావు, వాండ్రాసి అప్పలరాజు, గరే గుర్నాథ్, శాఖారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.