ఏపీ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం
సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ అందజేసిన అమిత్ షా
అక్షర కిరణం, (ఢల్లీి/అమరావతి): ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం లభించింది. ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతీరు కనబరిచినందుకు అమిత్ షా చేతుల మీదుగా ‘సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచి నందుకు ఏపీ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఢల్లీి విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి ఏపీ సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ మహిళా సంరక్షణ విభాగం ఎస్పీ కేజీవీ సరిత ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ సైబర్ కో ఆర్టినేషన్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించు కుని ‘సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’ను అందజేశారు.