స్వాతంత్య్ర భారత దేశంలో తొలిసారిగా విమానంలోనే అరెస్టులు
·ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని మరచిపోయేలా కాక్రోచ్ నాయకులపై బీజేపీ ప్రభుత్వ క్రూర నిర్బంధం
·నేను అరెస్టు అవ్వడానికే వచ్చాను, భయపడేది లేదు అన్న అభిజిత్ దీప్కే ·ప్రపంచవ్యాప్తంగా బీజేపీపై విమర్శలు
కిరణం, (ఢిల్లీ/జాతీయం): స్వాతంత్య్ర భారత దేశంలో తొలిసారిగా విమానంలోనే అరెస్టులు చేశారు. ·ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని మరచిపోయేలా కాక్రోచ్ నాయకులపై బీజేపీ ప్రభుత్వ క్రూర నిర్బంధం కొనసాగిస్తు న్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియతో కోట్లాది మంది అర్హులు ఓటు హక్కును కోల్పోతున్నారని, బీజేపీకి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొత్తులా మారిపోయారని ప్రతి పక్షాలు, పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా, ఆయన రాజీ నామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. నిరసనకారులు ఢిల్లీలోకి రాకుండా అష్టదిగ్భంధనం చేసిన పోలీసులు.. ఎక్కడకక్కడ అరెస్ట్ చేస్తున్నారు. జంతర్ మంతర్‌కు వెళ్లే దారులన్నీ మూసివేశారు. అలాగే, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు కొనసాగిస్తు న్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు, భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఢిల్లీకి వచ్చేవారిని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల, బస్టాండ్లలోనే ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ముంబయి నుంచి ఢిల్లీకి వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను విమానంలో మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అభిజిత్ దీప్కే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను అరెస్ట్ కావడానికే వచ్చానని, భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధిం చిన వీడియోను సీజేపీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
“నేను అరెస్ట్ అవ్వడానికే వచ్చారు.. అరెస్ట్ చేయండి.. నేను మీకు భయపడను.. నా బ్యాగు తీసుకోనివ్వండి” అని దీప్కే అంటే.. ‘ఇది అరెస్ట్ కాదు.. దయచేసి సహకరించింది’ అని పోలీసులు చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. ఈ సందర్భంగా సీజేపీ నాయకులు ‘విప్లవం వర్ధిల్లాలి’, ‘భారత్ మాతాకు జై’ అని నినాదాలు చేశారు. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అభిజీత్ దీప్కేలను అదుపులోకి తీసుకుని.. విమానాశ్రయం వెనుక గేటు నుంచి తరలించారు. అయితే, వీరిని ఎక్కడకు తీసుకెళ్లారనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ, దీప్కేను గురుగ్రామ్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించినట్టు సమాచారం.
అలాగే, ఈ నిరసనల్లో పాల్గొనడానికి జర్మనీ నుంచి వచ్చిన ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే, సీజేపీ లీగల్ సెల్ హెడ్ రత్నాసింగ్ కూడా తనను ఇంటి వద్దే పోలీసులు వాహనంలో నిర్బంధించారని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అరెస్ట్‌కు కారణాలను చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ నిరసనల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు.. 400 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. పలు రైళ్లను రద్దుచేయడమే కాదు.. ఢిల్లీలో మెట్రో స్టేషన్లను మూసివేశారు. భద్రతా విధుల కోసం 20 వేల మంది కేంద్ర సాయుధ బలగాలతో పాటు 35 వేల మందిని మోహరించారు.
జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కనీసం 10 రోజుల ముందు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని, కానీ అక్టోబరు 7న అనుమతి కోరారని, గతంలో నిబంధనలు ఉల్లఘించడంతోనే అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. అయితే, దీనిపై సీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఖండించింది. తమ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అవతకలకు పాల్పడ్డారని, దీనికి సీఈసీ జ్ఞానేష్ కుమార్ బాధ్యుడనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీజేపీ ఆయన రాజీనామా కోరుతూ అక్టోబరు 2న ఉద్యమాన్ని ప్రారంభించింది.