నేను అవినీతిపరుడినైతే రూ.మూడు వేల కోట్లు నా జేబులో చేరేవి
కఢల్లీి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): నేనే అలాంటి వాడినైతే రూ.3000 కోట్లు నా జేబులో పడేవని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢల్లీి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నిజాయితీపరుడుగా తనకు ఉన్న ఇమేజ్ను దెబ్బతీసేందుకు బీజేపీ తనను జైలుకు పంపిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. జైలులో ఉంచడం ద్వారా తనను మానసికంగా, శారీరకంగా బలహీనుడిని చేయాలని వారు అనుకున్నారని చెప్పారు. అయితే అది వారికి సాధ్యం కాదని తేల్చి చెప్పారు తానే అవినీతిపరుడిని అయితే మూడు వేల కోట్ల రూపాయలు తన జేబులో కి చేరేవని ఈసందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.