ఏపీలో 26 జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమిం చింది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లాకు అనిత, శ్రీకాకుళం జిల్లాకు కొండపల్లి శ్రీనివాస్, పార్వతీపురం మన్యం జిల్లా, కోనసీమ జిల్లాకు అచ్చెన్నాయుడును ఇన్ చార్జిలుగా నియమించారు. విశాఖ జిల్లాకు బాలవీరాంజ నేయస్వామి ఇన్చార్జి మంత్రిగా నియమితులయ్యారు. అల్లూరి జిల్లాకు సంధ్యారాణి, అనకాపల్లికి కొల్లు రవీంద్ర, కాకినాడ జిల్లాకు నారాయణను ఇన్చార్జి మంత్రిగా నియమించారు. కర్నూలు, తూ.గో జిల్లాలకు నిమ్మల రామా నాయుడు, పల్నాడు, ప.గోదావరి జిల్లాలకు గొట్టిపాటి రవి కుమార్, ఎన్టీఆర్ జిల్లాకు సత్యకుమార్‌ను ఇన్చార్జి మంత్రులుగా నియమించారు. కృష్ణా జిల్లాకు వాసంశెట్టి సుభాష్, గుంటూరు జిల్లాకు కందుల దుర్గేష్, బాపట్లకు పార్థసారథి, ప్రకాశం జిల్లాకు ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు జిల్లాకు ఫరూఖ్‌ను ఇన్చార్జిమంత్రులుగా నియ మించారు. నంద్యాల జిల్లాకు పయ్యావుల కేశవ్, అనంత పురం జిల్లాకు టీజీ భరత్. శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలకు అనగాని సత్యప్రసాద్‌ను నియమించారు. కడప జిల్లాకు సవిత, అన్నమయ్య జిల్లాకు బీసీ జనార్ధన్‌రెడ్డి, ఏలూరుకు నాదెండ్ల మనోహర్, చిత్తూరు జిల్లాకు రాంప్రసాద్రెడ్డిలను ఇన్చార్జి మంత్రులుగా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు.