పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర భృతిని ప్రకటించండి
Åఎస్టీయÖ డిమాండ్
అక్షర కిరణం, (చిట్టివలస): రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పీఆర్సీ కమీషన్ నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలని ఎస్టీయÖ జిల్లా ప్రధానకార్యదర్శి ఇమంది పైడిరాజు డిమాండ్ చేశారు. గురువారం చిట్టివలస జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘంటన మోహనరావు సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి, నాన్చివేత విధానం తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికే 5 పెండింగ్ డీఏలు బకాయి పడ్డ ప్రభుత్వం వాటిపైన కూడా స్పందించాలని కోరారు. ప్రతివారం సమస్యల పరిష్కారం కోసం సమావేశాలు జరు గుతున్నాయని కానీ ఏ సమావేశంలోనూ ఉద్యోగులు కోరుతున్న మధ్యంతర భృతి, డీఏ ప్రకటన అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం ఇదేవిధమైన తీరును కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందచేశామని, ఖీAPTO ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పికెటింగ్ నిర్వహించామని రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో 2004 కు మునుపు నియమించబడిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ్పుPS స్థానే OPS అమలు చేయడం అభినందనీయమని సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగు లతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి కూడా రిటైర్మెంట్ వయసును పెంచడం అభినందనీ యమన్నారు.
అనంతరం ఎస్టీయÖ జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన గంటాన మోహనరావును ఘనంగా సన్మానించారు. ఘంటన మోహనరావు వృత్తిలో అంకిత భావంతో పనిచేసి ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆదర్శనీయమైన వ్యక్తని అందుకే రాష్ట్రా స్థాయిలో ఉత్తమ అవార్డు కూడా పొందారని కొనియాడారు. కార్యక్రమంలో చిట్టివలస ప్రధానోపాధ్యా యుడు దొడ్డి ఆదినారాయణ, లక్ష్మీపురం ప్రధానోపాధ్యా యుడు సత్యారావు, STU రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డిపల్లి జగదీశబాబు, ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘ నాయకులు చందోలు వెంకటేశ్వర్లు, ఫ్రెండ్ అసోసియేషన్ తరపున రేఖ అప్పారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ అప్పారావు పాల్గొన్నారు.