అప్పన్న చందనోత్సవం, నిజరూప దర్శనం టికెట్ల విక్రయాలు ప్రారంభం
అక్షర కిరణం, (మాధవధార): ఈనెల 30వ తేదీన సింహాచలం వరహా లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో స్వామివారి చందనోత్సవం, నిజరూప దర్శనం నిర్వహి స్తున్నట్టు ఆలయ ఈవో సుబ్బారావు తెలిపారు. ఈనేపథ్యంలో ఈనెల 24 గురువారం నుంచి టికెట్ల విక్రయం ప్రారంభి స్తున్నట్టు తెలిపారు. రూ.300, రూ.1000 టికెట్లు తీసుకునే భక్తులు కొండపైన దేవస్థానం పాత పీఆర్వో కార్యాలయం వద్ద పలు బ్యాంక్ బ్రాంచ్‌లలో దరఖాస్తులు తీసుకుని ఆధార్ నంబర్‌తో పూర్తి చేసి టికెట్లు నేరుగా పొందవచ్చని తెలిపారు. కొండపైన పాత పీఆర్వో ఆఫీసు వద్ద ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు టికెట్లు విక్రయిస్తారని తెలిపారు. అదేవిధంగా సింహాచలంలోని యూనియన్ బ్యాంకు, ఎస్బీఐల బ్రాంచ్‌లలో ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు శని, ఆది వారాలలో కూడా టికెట్లు పొందవచ్చన్నారు.
అలాగే అక్కయ్యపాలెం యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో బ్యాంకు పనివేళల్లో టికెట్లు విక్రయిస్తారని తెలిపారు. యూనియన్ బ్యాంక్ మహారాణిపేట కేజీహెచ్ బ్యాంకు బ్రాంచ్‌లో పనివేళల్లో టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. బిర్లా జంక్షన్‌లోని ఎస్బీఐ బ్రాంచ్‌లో బ్యాంకు పనివేళల్లో టికెట్లు విక్రయిస్తారని తెలిపారు. అదేవిధంగా అక్కయ్య పాలెం సాలిగ్రామపురం ఎస్బీఐ బ్రాంచ్‌లో బ్యాంకు పనివేళల్లో టికెట్లు విక్రయిస్తారని తెలిపారు. ఈనెల 29వ తేదీ వరకు ఈ టికెట్లు విక్రయిస్తారని తెలిపారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం లభించేందుకు ఈ నెల 30వ తేదీన చందనయాత్ర రోజున కూడా ఎటువంటి టికెట్లు విక్రయించరని తెలిపారు. స్వామివారి ఉచిత దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీటెంపుల్స్.ఏపీ.జీఓవీ. ఇన్ ఆన్లైన్ వెబ్సైట్లో కూడా ఈనెల 29వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.