విశాఖ హెల్త్ సిటీలో అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్
కప్రతి రోజు 24 గంటలు రోగులకు సేవలు
జ్యోతి ప్రజ్వలన చేసి క్లినిక్‌ను ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత
అక్షర కిరణం (విశాఖపట్నం సిటీ): యువతలో పెరుగుతున్న ఆకస్మిక గుండె మరణాలను ఎదుర్కొనేందుకు విశాఖపట్నంలోని హెల్త్ సిటీలో అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ‘అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ను హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్ట సమయాలలో రోగులకు సహా యం చేసే వైద్యుల సేవలు ప్రశంసనీయం అన్నారు. గుండె జబ్బులు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు.. మనకు మొదట గుర్తుకు వచ్చే పేరు ‘అపోలో’ అన్నారు. రోగులకు సులభంగా స్నేహ పూర్వకంగా వైద్యం అందించ డంలో తన కర్తవ్యాన్ని కొనసాగిస్తూ.. ఇప్పుడు ఛెస్ట్ పెయిన్ క్లినిక్ ప్రారంభిం చిందని తెలిపారు. ఛాతి నొప్పితో బాధపడే ఎవరికైనా ఇది తక్షణ సహాయం అందిస్తుందన్నారు. ఆ నొప్పి గుండెకు సంబంధించినదైతే తక్షణమే చికిత్స అందుతుంద న్నారు. ఆ నొప్పి గుండెకు సంబంధించినది కాకపోతే, అపోలో ఆస్పత్రులు ఎలాంటి చార్జీలు వసూలు చేయవ న్నారు. గ్రామీణ ప్రాంతాల వారి కోసం అపోలో హాస్పిటల్స్ గుండె ఆరోగ్యంపై వీడియోలు, ఇతర సమాచారాన్ని రూపొం దించాలని కోరారు. అపోలో హాస్పిటల్స్ రీజినల్ సీఈవో వై సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఛాతి నొప్పి క్లినిక్ సేవలు అపోలో ఆస్పత్రి రామనగర్, హెల్త్‌సిటీలోని అపోలో హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. చాతి నొప్పి లక్షణాలు కని పిస్తే సమీప క్లినిక్‌ను సంప్రదించవచ్చన్నారు.. విజిట్ సమయంలో ఆర్థిక భారం లేకుండా గుండె సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకు రావడం లక్ష్యమన్నారు.
గుండె సంబంధిత నొప్పిని త్వరగా గుర్తించి కార్డియాక్ మరణాలను నివారించడానికి ఈ క్లినిక్‌లను ప్రారంభించా మన్నారు. 24/7 కార్డియాలజిస్టు సేవలు అందుబాటులో కలవన్నారు. ‘అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ హాస్పిటల్స్ రెండూ రోగులకు అవసరమైన సేవలు అందించేందుకు అత్యాధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నాయన్నారు. అపోలో హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ డీకే బారుప్ా మాట్లాడుతూ వైజాగ్‌లో అపోలో హాస్పిటల్ ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతంలో కార్డియాక్ కేర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. ఈ విషయంలో మార్గదర్శకులుగా ఉన్నందుకు గర్విస్తున్నామని తెలిపారు. ఈ క్లినిక్‌తో గుండె జబ్బులు గుర్తింపు, అత్యవసర చికిత్సలో ఆలస్యం వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని నివారించాలన్నది మా లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ సీనియర్ డాక్టర్ ఎన్కే పాణిగ్రాహి, డాక్టర్ శశాంక చుండూరి, డాక్టర్ చక్రదర్ పెడాడ, డాక్టర్ రవికాంత్ టి.కార్డియోథొరాసిక్ సర్జన్లు డాక్టర్ జేకే త్రివేది, డాక్టర్ ఎల్ విజయ్, డాక్టర్ మెడికల్ సూపరింటెండెంట్ బాలకృష్ణ, సీఓఓ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.