విశాఖలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
కటీడీపీలో చేరిన ఆరుగురు కార్పొరేటర్లు
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు గురువారం వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అమరావతిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరుగురు కార్పొరేటర్లకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో 13వ వార్డు కార్పొరేటర్ కే.సునీత, 17వ వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య, 36వ వార్డు కార్పొరేటర్ ఎం.మేరీజాన్సీ, 54వ వార్డు కార్పొరేటర్ చల్లా రజనీ, 57వ డివిజన్ కార్పొరేటర్ ముర్రి వాణి నానాజీ, 73వ డివిజన్ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత పార్టీలో చేరారు. కార్యక్ర మంలో విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పైలా శ్రీనివాసరావు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.