14న సత్తెమ్మ, మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతర
అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక తీర్థం
భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ
అక్షర కిరణం, (సింహాచలం): సింహాద్రినాథుని సోదరి అడవివరంతోపాటు శ్రీనివాస్ నగర్ పరిసర 14 గ్రామాల పొలిమేర దేవతగా పూజలు అందుకుంటున్న. సత్తెమ్మ, మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతరను శుక్ర వారం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశా మని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి.వెంకట్రావు తెలిపారు. గురువారం వీరు ఆలయం వద్ద ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మాట్లా డారు. శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి, ఆరాధన గావిస్తామన్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారిని భక్తులు దర్శిం చుకోవచ్చునన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని భారీగా విద్యుత్ దీపాలతో అలంకరించడంతోపాటు అలాగే అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దడము జరుగుతుంది అన్నారు..ఉదయం నుంచి ఆలయం వద్ద ప్రసాద వితరణ, మధ్యాహ్నము అన్న సమారాధన, మజ్జిగ, మంచి నీరు సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. అమ్మవారి పుట్టినరోజు సందర్బంగా ఆలయం వద్ద తీర్ధ మహోత్సవం జరుగుతుంది అన్నారు.. కావున ఆయా గ్రామాల ప్రజలు అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించుకోవాలని అమ్మవారిని దర్శించు కుని తల్లి కృపకు పాత్రులు కావాలని వీరు పిలుపునిచ్చారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో కమిటీ ఉపాధ్యక్షులు గంట్ల కనకరాజు, జాయింట్ సెక్రెటరీ బలిరెడ్డి శ్రీనివాసరావు, పారిశ్రామికవేత్త బీవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.