210 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రయల్ రన్ ప్రారంభం
4 గంటలు తగ్గనున్న ప్రయాణ సమయం
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): దేశంలో పలు నగరాలు, పట్టణాల మధ్య మరింత మెరుగైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. అనేక ప్రాజెక్టులు చేపడుతోంది. ఈక్రమంలోనే హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తోంది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల మధ్య ఈ హైవేలు అందుబాటు లోకి వచ్చాయి. తాజాగా మరో కీలక ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తి చేసుకుని.. ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. ఉత్తర భారత దేశంలోనే కీలకమైన హైవే ప్రాజెక్టుల్లో ఒకటైన ఢల్లీి-సహ రాన్పూర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను త్వరలోనే ప్రారంభించ నున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక సెక్షన్ ట్రయల్ రన్ కోసం తెరిచారు. ఈ హై స్పీడ్ కారిడార్ పూర్తిస్థాయి ప్రారంభానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.
ఢల్లీి, డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం 6 గంటల నుంచి ఆరున్నర గంటలు ఉండగా.. ఈ 210 కిలో మీటర్ల పొడవైన ఈ ఢల్లీి-సహరాన్పూర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి అయితే.. ప్రయాణ సమయం.. కేవలం 2 గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇది దేశ రాజధాని ఢల్లీి నుంచి.. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల మధ్య కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నాయి. డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి ప్రారంభం మధ్య 32 కిలోమీటర్ల పూర్తి చేసిన విభాగాన్ని ప్రారంభించడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు.
ఢల్లీిలోని షాదారా, సీలాంపూర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉంచిన అడ్డంకులను తొలగించి వాహన రాకపోకలకు అనుమతించారు. ఈ 6 లేన్ల (భవిష్యత్తులో 8 లేన్లకు విస్తరించే అవకాశం ఉంది) ఎక్స్‌ప్రెస్‌వేలో అండర్ పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జ్‌లు వంటి అత్యాధునిక మౌలిక సదు పాయాలు ఉన్నాయి. ఈ కారిడార్ ఢల్లీిలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్ సమీపంలో ప్రారంభమై పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ లోని బాఫ్ుపట్, షామ్లీ, సహారన్పూర్ మీదుగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌లో ముగుస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి.. వాహనదారులకు అందుబాటు లోకి తీసుకురానున్నారు.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తర భారతదేశంలో ప్రయాణించే విధానాన్ని పూర్తిగా మార్చనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ 210 కిలోమీటర్ల హై స్పీడ్ కారిడార్ నిర్మాణం మొత్తం 4 దశల్లో జరుగుతోంది. మొదటి దశలో భాగంగా అక్షరధామ్ నుంచి బాఫ్ుపట్ వరకు ఉండగా.. ఇది ఇప్పటికే ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ఇక రెండో దశలో బాఫ్ుపట్ నుంచి.. సహారన్పూర్ వరకు మార్గం దాదాపు పూర్తి కావచ్చింది. మరోవైపు.. మూడవ దశ కూడా ముగింపు స్థితిలో ఉంది. నాలుగో దశ డెహ్రాడూన్ సమీపంలోని కొండ ప్రాంతంలో ఉన్న సొరంగాలు, ఎలివేటెడ్ నిర్మాణాలు ఫినిషింగ్ పనుల్లో ఉన్నాయి.
ఆరు లేన్లుగా నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో వాహనదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా డ్రైవింగ్ అనుభవం కోసం అనేక ఇంటర్‌ఛేంజ్‌లు, సర్వీస్ లేన్లు, అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఢల్లీిలోని గీతా కాలనీ, సీలాంపూర్, షాదారా ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్‌వే ట్రయల్ వినియోగం కోసం అడ్డంకులను తొలగించారు. ఈ ప్రాజెక్టులోని నాలుగు దశలు పూర్తయిన తర్వాత.. ఎటువంటి అంతరాయం లేని హై-స్పీడ్ ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఫిబ్రవరి 2026 నాటికి ఈ ఎక్స్‌ప్రెస్‌వేను పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.