జీవీఎంసీలో 20 వసంతాల వేడుక
కవిశాఖ ప్రగతి బంధు పేరుతో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఘనంగా సన్మానం
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీలో 20 వసంతాల వేడుకలను నిర్వహించారు. విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీకి సకాలంలో బాధ్యతతో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను చెల్లించిన ఆస్తిపన్ను దారులను ‘‘విశాఖ ప్రగతి బంధు’’ పేరున అభినందించి ,ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. వారందరికీ జీవీఎంసీ తరపున ప్రత్యేక ధన్యవాదాలను విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ‘విశాఖ ప్రగతి బంధు’’ అభినందన కార్యక్రమం నిర్వహించి సకాలంలో పన్నులను చెల్లించిన ఆస్తి పన్ను దారులను సన్మానించారు. అనంతరం 20 వసంతాల వేడుకల సందర్భంగా నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్ డివి రమణమూర్తి, డిసిఆర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులతో కలసి కేక్ ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. నగర మేయర్ మాట్లాడుతూ విశాఖపట్నం అభివృద్ధి దిశగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు సహకరిస్తున్న ఆస్తి పన్ను చెల్లింపుదారులంద రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గ్రేటర్ విశాఖపట్నంగా జీవీఎంసీ ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తయినందున జీవీఎంసీలో ‘‘విశాఖ ప్రగతి బంధు’’ కార్యక్రమంతో సకాలంలో పన్నులను చెల్లించి విశాఖ నగర అభివృద్ధికి సహకరి స్తున్న ఆస్తి పన్నుదారులను సన్మానించుకోవా ల్సిన అవసరం జీవీఎంసీకి ఉందన్నారు. జీవీ ఎంసీ కమిషనర్‌తోపాటు అధికారులందరూ రోజులో అధిక సమయం విధులు నిర్వహిం చడం వలన నగరం పరిశుభ్రతగా ఉందన్నారు.
డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజులు మాట్లాడుతూ జీవీఎంసీ ఆవిర్భవించి 20 వసంతాల వేడుకలను చేసుకోవడం గా ‘విశాఖ ప్రగతి బంధు’ కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు, పన్ను చెల్లింపుదారులకు ధన్య వాదాలు తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ దేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద నగరాలలో మొదటిది ఢల్లీి అని, 2వ నగరం మన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అని తెలిపారు. దేశంలో పలు రాష్ట్రాలే కాకుండా కొన్ని ఇతర దేశాల కంటే కూడా జీవీఎంసీ పెద్దగా విస్తరించి ఉందని తెలిపారు. గ్రేటర్ విశాఖ 20 వసంతాలు పూర్త యిన సందర్భంగా జీవీఎంసీ సకాలంలో పన్నుల చెల్లించిన 6 క్యాటగిరీలు గా గుర్తించి న ఆస్తిపన్ను దారులను ‘‘విశాఖ ప్రగతి బంధు’’ పేరున వారిని అభినందించి, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను, అందించి సన్మానించా మని తెలిపారు. జీవీఎంసీ ఆదాయం పెంచి ఆస్తి పన్ను చెల్లింపు కోసం 8 సౌకర్య కేంద్రా లకు బదులు ప్రస్తుతం 20 సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎస్ఆర్ ఫండ్స్‌తో విశాఖ అభివృద్ధికి సహకరిస్తున్న కార్పొరేట్ సంస్థలకు కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ జీవీఎంసీ ప్రగతికి ఏకైక మార్గం రెవెన్యూ అని దానిని ఆస్తి పన్నులతో సమకూ ర్చుకోవచన్నారు. కార్యక్రమంలో 56వ వార్డు కార్పొరేటర్ శరగడం రాజశేఖర్, జీవీఎంసీ అధికారులు, కొరమోఁడల్, ఎస్సార్ స్టీల్, టెక్ మహీంద్ర సంస్థల ప్రతినిధులు, ఎ.పి.పెర్వాస్ కార్యదర్శి, జె.ఆర్.నగర్ నివాసిత సంక్షేమ సంఘం ప్రతినిధి డాక్టర్ కేఎస్.ఆర్.మూర్తి, పలువురు సన్మాన గ్రహీతలు, ఎస్.ఆర్.యు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రాజమణి, జీవీఎంసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.