డ్రగ్స్ నిర్మూలనపై మంత్రి సంధ్యారాణి సైకిల్ ర్యాలీ
అక్షర కిరణం, (సాలూరు): డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం మని,సమాజ రహిత సేవలో యువత ముందుకు రావాలని, స్త్రీశిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యంజిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్,కు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అభ్యుదయం సైకిల్ యాత్రను మంత్రి సంధ్యారాణి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో -వద్దే వద్దు బ్రో డ్రగ్స్ వద్దు- చదువే ముద్దు అంటూ పిలుపునిచ్చారు. ర్యాలీ సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రారంభమై డీలక్స్ సెంటర్ వరకు కొనసాగింది. మంత్రి సంధ్యారాణి సైకిల్ తొక్కుతూ యువతను ఉత్తేజపరిచారు. అమ్మకి చెప్పి ఏపనైనా చేయండి’’ అంటూ వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టి,కాఫీ సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. యువత క్రీడా స్ఫూర్తిని క్రమశిక్షణ సామాజిక బాధ్యత పెంపుపై దృష్టి సారించాలని అన్నారు. ఈకార్యక్రమంలో సాలూరు పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు. పట్టణ నాయకులు, డీఎస్పీ రాంబాబు, సాలూరు పట్టణ, రూరల్, సీఐలు. ఎస్ఐలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.