ఘనంగా పైడిమాంబ అమ్మవారి వార్షిక జాతర
అక్షర కిరణం, (మాధవధార): 51వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో శ్రీపైడిమాంబ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండగ కారణంగా అంబేద్కర్ కాలనీలో సందడి వాతావరం నెలకొంది. ముఖ్య అతిథులుగా వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సాయి మాస్టర్, మల్లికార్జున రావు, ఆదినారా యణ, చంద్రశేఖర్, కొండబాబు, దిలీప్ కుమార్, బంగారు రాజు, వైసీపీ నాయకులు నూకరాజు, రామారావు, పైడిరాజు, ఎర్ని బాబు, సింహాచలం, లక్ష్మీ, ఆలయ కమిటీ సభ్యులు అంబేద్కర్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.