మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ ర్యాలీ
అక్షర కిరణం, (సాలూరు): అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ స్త్రీశిశు సంక్షేమ గిరిజన శాఖమంత్రి సంధ్యారాణి ఆధ్యర్యంలో మంగళవారం నిర్వహించారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ రైతుల సంక్షేమం, పంటల అభివృద్ధి, సాగు నీటి విస్తరణ, పంట నష్ట పరిహారం వంటి అంశాలలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయడం ఈకార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.మని అన్నారు. మంత్రి సంధ్యారాణి పలు గ్రామాల్లో ట్రాక్టర్ ర్యాలీలలో పాల్గొని రైతులను కలిశారు. ఈర్యాలీలో 200కుపైగా ట్రాక్టర్లు పాల్గొని, ప్రజల్లో మరింత ఉత్సాహం కలిగిందని, ట్రాక్టర్లపై అన్నదాత సుఖీభవ, బ్యానర్లు అమర్చడం, మహిళల ఆధ్వర్యంలో పొలం పూజలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనీ, పొలాల్లో పని చేస్తున్న రైతులను ప్రత్యక్షంగా కలిసి,వారి సమస్యలు విన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్.పి.భంజ్‌దేవ్, సాలూరు పట్టణ నాయకులు కౌన్సిలర్లు మండల నాయకులు నియోజకవర్గ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.