నూకాంబిక ఆలయంలో అన్నసమారాధన
అక్షర కిరణం, (మాధవధార): జీవీఎంసీ 49వ వార్డు బర్మాక్యాంప్లోని జై భారత్ నగర్లో కొలువైన నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం అన్నసమారాధన నిర్వహించారు. జై భారత్ నగర్ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు బొగ్గు శ్రీను ఆధ్వర్యంలో జరిగిన అన్నసమారాధనలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.