అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): నగరంలో గురువారం సాయంత్రం పలుచోట్ల అన్న క్యాంటీన్లో ప్రారంభ మయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారు లు కలిసి ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న 9, 13, 20, 17 వార్డుల పరిధిలోని ఆరిలోవ కాలనీ, చిన్న వాల్తేరు, ఎంపీపీ రైతుబజార్ వద్ద అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ ఎంపీ శ్రీభరత్, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కలెక్టర్ హరేంధిరప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ ప్రారంభించారు. వక్తలు మాట్లా డుతూ ఐదు రూపాయలకే మూడు పూటల పేదలకు భోజనం అందించే పథకం అన్నక్యాంటీన్లని కొనియా డారు. కార్యక్రమంలో టీడీపీ మీడియా కోఆరి ్డనేటర్ పోతంరెడ్డి, తెలుగుదేశం సీనియర్ నాయకులు పట్టాభి, బట్ట వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.