అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార మహోత్సవం
అక్షర కిరణం, (పలాస): పోషకాహార మహోత్సవం లో భాగంగా అంబుసోలి 1, పలాస 1, అంగన్వాడీ కేంద్రా లలో పలాస హై స్కూల్లో, సమావేశం ఏర్పాటు చేసి తల్లు లు తీసుకోవాల్సిన పోషకాహారం కోసం, గర్భిణీలు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై, పూర్వప్రాథమిక విద్యపై అవగాహన కల్పించారు. పదకుండు నుండి పద్దినిమిది వయసు గల విద్యార్థులకి మత్తుపదార్థాల మీద కిశోరా బాలికలు తీసుకో వాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ గంగమ్మ, వార్డ్ కౌన్సిలర్ మీసాల సురేష్, ఇంచార్జ్ సీహెచ్ రామకృష్ణ, బి.రవి, జి.దేవరాజు, జనార్దన, అంగన్వాడీ కార్యకర్తలు లలిత, జయలక్ష్మి, ఇందుమతి, తల్లులు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు.