గ్లోబల్ సప్లై చైన్‌లో ఏపీ ఉత్పత్తులకు స్థానం కల్పించాలి
îవాల్‌మార్ట్, ఫి˜¾్లప్కార్ట్లకు మంత్రి నారా లోకేష్ ప్రతిపాదన
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఈ కామర్స్, రిటైల్ దిగ్గజాలు వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ల గ్లోబల్ సప్లై చైన్‌లో ఏపీ ఉత్పత్తులకు స్థానం కల్పించాలని మంత్రి నారా లోకేశ్ ప్రతి పాదనలు చేశారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహా యక సంఘాలు, స్థానిక చేతి వృత్తుల కళాకారులు తయా రు చేస్తున్న ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పరి చయం చేయాలని నారా లోకేశ్ కోరారు. మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదనలపై వాల్‌మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్ పాజిటివ్‌గా స్పందించినట్టు తెలుస్తుంది.
ఏపీ రాష్ట్ర ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు ప్రముఖ ఈ కామర్స్, రిటైల్ దిగ్గజాలు వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ల గ్లోబల్ సప్లై చైన్‌లో ఏపీ ప్రొడక్టులకు మంచి స్థానం కల్పించాలని మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రపంచస్థాయి కొనుగోలుదారులను తీసుకురావడమే లక్ష్యంగా ఆయన వారితో చర్చలు జరిపారు. అలాగే రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు, స్థానిక చేతి వృత్తుల కళాకారులు తయారు చేస్తున్న ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేయాలని లోకేశ్ కోరారు. అదేవిధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘స్వయం ఏపీ’, ‘లేపాక్షి’ బ్రాండ్ల ఉత్పత్తులను వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ల సరఫరా వ్యవస్థల్లోకి అనుసంధానించాలని కోరారు.
ప్రతిపాదనలపై సానుకూల స్పందన...
అయితే మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదనలపై వాల్‌మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో తమకున్న సుదీర్ఘ వ్యాపార బంధాన్ని ఆయన వివరించి నట్టు తెలుస్తుంది. ప్రతి ఏటా ఏపీ నుంచి సుమారు 6.5 కోట్ల పౌండ్ల రొయ్యలను కొనుగోలు చేస్తున్నామని, అలాగే ఫార్మా, వస్త్ర, ఇంజినీరింగ్ ఉత్పత్తులను కూడా పెద్ద ఎత్తున సేకరిస్తున్నామని కూడా వెల్లడించారు.
ఇదే సందర్భంలో ఏపీలో ఫ్లిప్‌కార్ట్ వల్ల వచ్చిన పెట్టుబడులతో ఇప్పటికే 28 వేలకుపైగా ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడం జరిగిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా లాజిస్టిక్స్ హబ్‌లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఏపీ లోని ఎంఎసఎంఈ కార్పొరేషన్, రతన్‌టాటా హబ్‌ల భాగ స్వామ్యంతో ఇప్పటివరకు 3 వేల 200లకు పైగా చిన్న పరిశ్రమలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా 900కు పైగా స్థానిక సంస్థలను ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లో విజయవంతంగా చేర్చినట్టు వారు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రాబోయే రోజుల్లో వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.