అనధికారిక నిర్మాణంపై చర్యలు
కఅశోక్ నగర్లో అక్రమ కట్టడం తొలగింపు
కజోన్`5 టౌన్ ప్లానింగ్ అధికారుల నోటీసులు
కఅక్షర కిరణం వార్తకు స్పందన
అక్షర కిరణం, (విశాఖ సిటీ): జీవీఎంసీ జోన్ ఫైవ్ మాధవధార పరిధిలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై జీవీ ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎట్టకేలకు స్పందిం చారు. కొంతకాలంగా జోన్ 5 మాధవధార మురళినగర్ కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున అనధికారిక నిర్మాణాల జోరు కొనసాగుతోంది. స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే పేషిల పేర్లు చెప్పి అనధికారిక నిర్మాణా లను చేయిస్తున్నారు. అక్రమ కట్టడాలను నిరోధించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో అక్రమ కట్టడం యాజమాని నుంచి లక్షలాది రూపా యలు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మాధవధారలో గత వారంలో అశోక్ నగర్లో కళింగ నగర్లో స్టిల్త్ జి ప్లస్ టువకు మాత్రమే అనుమతి ఉండగా దానిపైన అదనంగా మరో అనధికారిక నిర్మాణాలు కొనసాగాయి. ఈనేపథ్యంలో ఈవారం అక్షర కిరణం పత్రికలో ‘పౖౖెరవీల యూసీలు’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై టౌన్ ప్లానింగ్ సీసీపీ ప్రభాకర్ రావు స్పందించి జోనల్ అధికారులకు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏసీపీ తిరుపతిరావు టీపీవో ప్రవీణ్ ఆధ్వర్యంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పవన్అశోక్ నగర్లో అక్రమంగా నిర్మిం చిన అదనపు అంతస్తును తొలగించారు. మురళినగర్లో మరో అనధికార అంతస్తులపై రంధ్రాలు పెట్టారు. అదేవిధం గా ఆయా అక్రమ కట్టడాలకు సంబంధించి 452 నోటీసు లు జారీ చేశారు.