అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265కు చేరిన మృతుల సంఖ్య
అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
అక్షర కిరణం, (అహ్మదాబాద్/జాతీయం): భారత్‌లో అత్యంత ఘోరమైన దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 265 మందికి పెరిగినట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది. ఈ విమానంలో 12 మంది క్రూ సిబ్బంది, 230 మంది ప్రయాణికులు.. మొత్తం 242 మంది ఉండగా.. ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఇక విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో కొంతమంది మెడికోలు కూడా మరణించారు. 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన 11 ఏళ్ల ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్‌లైనర్.. కేవలం 425 అడుగులు ఎగిరిన తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత 30 సెకన్లలోనే భయంకరమైన దృశ్యాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఎయిరిండియా చరిత్రలోనే రెండో అతిపెద్ద దుర్ఘటన. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో పాటు లోహవిహంగం ఢీకొట్టిన మెడికల్ కాలేజీ హాస్టల్లోని 20 మందికిపైగా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో చనిపోయినవారిని డీఎన్ఏ పరీక్షలతో గుర్తించనున్నారు. విమానంలో ఇంధనం అధికంగా ఉండటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
40 మంది మృతదేహాలు మిస్సింగ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 260 మందికిపైగా ప్రయాణాలు కోల్పో యారు. ఇప్పటి వరకూ 200 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకు న్నారు. అయితే, 40 మందికిపైగా మృతదేహాల ఆనవాళ్లు కూడా లభ్యం కాలేదు. ప్రమాదం తర్వాత భారీ మంటల్లో ప్రయాణికులు కాలిబూడిద య్యారు. మసిబొగ్గులు మాత్రమే మిగిలాయి. దీంతో మృతదేహాలను గుర్తించడం కష్టతరంగా మారింది.
అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రికి 265 మృతదేహాలు
లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం బి.జె. మెడికల్ కాలేజీ సమీపంలోని నివాస ప్రాంతాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదం తరువాత కనీసం 265 మృతదేహాలను అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన తర్వాతే మరణించిన వారి సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు.
డీఎన్ఏ మ్యాచింగ్ జరుగుతోంది.. 3 రోజులకు పైగా పట్టవచ్చు
డీఎన్ఏ నిర్ధారణ తర్వాత మృతదేహాలను అప్పగిస్తామని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ ఒక ప్రకటన చేశారు. ణచీA సరిపోలిన తర్వాత ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. బీజే మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని పీఎస్ఎం డిపార్ట్మెంట్ దగ్గర ఏర్పాటు చేసిన టెస్టింగ్ సెంటర్లో ణచీA నమూనాలు తీసుకునే ప్రక్రియ జరుగుతోంది. ణచీA నమూనాలు సేకరించి, సరిపోల్చడానికి ల్యాబ్‌కు పంపుతారు. ణచీA సరిపోలిక ప్రక్రియకు కనీసం మూడు రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలిపారు.
విమాన ప్రమాదంలో 75 మంది మెడికోలు మృతి?
ఎయిరిండియా విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భనవంపై కూలి పోవడంతో వైద్య విద్యార్థులు పదులు సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 24 మంది చనిపోయారని వార్తలు వచ్చాయి. కానీ, ఈ సంఖ్య 75గా ఉంటుందని తాజాగా ప్రచారం సాగుతోంది. 50 మందికిపైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
విజయ్ రూపానీ నివాసానికి మంత్రులు
ఈ ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని అధికారిక నివాసానికి ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రులు ములుభాయ్ బెరా, కున్వర్జీ బవాలియా, కుబేర్ డిరడోర్, భానుబెన్ బబారియా చేరుకు న్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో విజయ్ రూపాని దురదృష్టవశాత్తు మరణించారు.
అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో ప్రధాని మోదీ
ఎయిరిండియా-171 విమాన ప్రమాదంలో గాయపడి, అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తదితరులు ప్రధాని వెంట ఉన్నారు.
నేను ఎలా బ్రతికున్నానో నాకు తెలియదు..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ప్రాణా లతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్. శుక్రవారం ణణ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాను ఎలా బతికి బయటపడ్డా నో తనకు తెలియదని చెప్పారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ బెడ్ నుంచి ఆ భయానక క్షణా లను గుర్తు చేసుకుంటూ, విమానం ఎత్తుకు ఎగరడం లేదని, అది ఒక భవనాన్ని ఢీకొని పేలిపోయే ముందు ‘జస్ట్ గ్లైడిరగ్’ చేస్తోందని రమేష్ చెప్పారు. అంతా సెకన్లలో జరిగిపో యింది. మేము కిందకు దిగుతున్నామని నేను గమనించాను’’ అని ఆయన అన్నారు.