గిరిప్రదక్షిణ ఏర్పాట్లు వేగవంతం చేయండి
Åఅప్పన్న ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు
అక్షర కిరణం, (సింహాచలం): ఈ నెల 28న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి గిరిప్రదక్షిణ ఈ నెల 29న గుడి ప్రదక్షిణ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు గురువారం సింహాచలం పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్డీసీ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, సిబ్బందితోపాటు గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సీఐ సన్యాసి నాయుడు, ట్రాఫిక్ సీఐ సురేష్ పాల్గొని గిరిప్రదక్షిణ నిర్వహ ణకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ఉద్యోగుల డ్యూటీ పాయింట్ల కేటాయింపు, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం, జూలై 28, 29 తేదీల్లో విధులకు హాజరయ్యే సిబ్బందికి వసతి కల్పించడం వంటి అంశాలపై కార్యాచరణను ఖరారు చేశారు. తొలి పావంచ వద్ద క్యూలైన్ నిర్వహణను ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ జూలై 27 నాటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను జివీఎంసీతో సమన్వ యం చేసుకుని 27వ తేదీలోగా సిద్ధం చేయాలని సూచిం చారు. తొలి పావంచ వద్ద అన్ని శాఖల సమన్వయంతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తులకు అవస రమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ పరిస్థితు లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్డీసీ మధులత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు, డీఈ (ఇన్చార్జి) రామరాజు, ఏఈఓలు వాడ్రేవు రమణ మూర్తి, పిల్లా శ్రీనివాస్, గాడి అప్పలనాయుడు, పర్యవేక్షణ అధికారులు, గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సీఐ సన్యాసి నాయుడు ట్రాఫిక్ సీఐ సురేష్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.