బ్రాహ్మణతర్లా హెచ్‌ఎస్‌లో అబ్దుల్ కలాం జయంతి
అక్షరకిరణం, (పలాస/ బ్రాహ్మణతర్ల): భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతిని మంగళవారం బ్రాహ్మణతర్లా హైస్కూల్లో నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు. వక్తలు ప్రసంగిస్తూ.. భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్‌గా కలాం పనిచేశారన్నారు. మిస్సైల్ మాన్ కలాం బాలిస్టిక్ క్షిపణి వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారన్నారు. తన విజ్ఞానాన్ని దేశాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. తన ఆలోచనలు ప్రసంగాలతో విద్యార్థులను ఉత్తేజ పరిచేవార న్నారు. యువత కలాంను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎస్వీ.రమ ణారావు, ఉపాధ్యాయ సిబ్బంది, ఈశ్వర రావు, మధు బాబు, రమేష్, కొయ్యల శ్రీనివాసరావు, సుధాకుమారి, పద్మాలో చనం, జనార్ధనరావు, పద్మ, చంద్రశేఖర్, శివప్రసాద్, కిషోర్, రజని కుమారి, మెహర్ సుధా, జ్యోతమ్మ, అరుణ కుమారి, చిన్నారావు, లక్ష్మిబాయి, విష్ణాచారి, రవితేజ, కోటేశ్వరరావు, తులసీరాణి పాల్గొన్నారు.