కరాటే పోటీల్లో విజేతలకు ఏపీఎస్సీఆర్పీసీ చైర్మన్ కేసలి అప్పారావు అభినందన
అక్షర కిరణం, (విజయనగరం ప్రతినిధి): హైదరాబాద్‌లోని షాద్‌నగర్ కొత్తూరు జిల్లాలో ఈనెల 22వ తేదీన జరిగిన ఓపెన్ నేషనల్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. అక్కడ జరిగిన పోటీలలో విజయనగరం జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారు. ఆ విద్యార్థులకు ఏబీ బి చారిటబుల్ ట్రస్ట్, జై హనుమాన్ అశ్విని మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అకాడమీ, సుమన్ షోతోకన్ స్పోర్ట్స్ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీఎస్సీఆర్పీసీ) చైర్మన్ కేసలి అప్పారావు పతకాలు అందజేసి అభినందిం చారు. కేసలి అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. విద్యార్థులు చదువుతోపాటుగా క్రీడారంగంలో కూడా విజయాలు సాధించాలన్నారు. బాలికలకు ఈమార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఏబీ చారిటబుల్ ట్రస్ట్, ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఎం.ఎస్ స్వరూప్, కూరెళ్ళ శ్రీనివాస్‌రావు, లీగల్ అడ్వకేట్, పాండ్రంకి సంతోష్‌కుమార్, హ్యూమన్ రైట్స్ స్టేట్ జనరల్ సెక్రెటరీ, సుమన్ షోతోకన్ స్పోర్ట్స్ కరాటే డు అకాడమీ వైస్‌ప్రెసిడెంట్ పెంకె అశ్విని, ఎం.అప్పారావు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.