70 ఏళ్లు నిండిన పింఛáన్‌దారులకు ఏపీ ప్రభుత్వం అదనపు పెన్షన్ పెంపు
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 70 ఏళ్లు దాటిన ప్రభుత్వ పెన్షర్లకు శుభవార్త చెప్పింది. వారికి ఇచ్చే ఫించన్‌ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వయస్సు పైబడిన పింఛన్‌దారులకు ఆర్థికం గా మరింత ఊరటనందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈమేరకు ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నంబర్-126 (GO వీS చీశీ. 126)ను మంగÞ øవారం విడుదల చేసింది. 70 సంవత్సరాలు నిండిన సాధా రణ పెన్షనర్లకు, అదేవిధంగా ఫ్యామిలీ పింఛన్‌దారు లకు ఇప్పటి వరకు అదనపు ఏడు శాతం అదనపు పెన్షన్ చెల్లిస్తుండగా.. ఇప్పుడు దానిని 10 శాతానికి పెంచారు. ఇక 75 ఏళ్లు నిండిన వయో వృద్దులకు అదనపు పెన్షన్ ను 12 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
పెరిగిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందుతాయి?
పెరిగిన పెన్షన్లను ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1, 2027 నుంచి చెల్లించనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. అంటే లబ్ధిదారులు ఈ జనవరి నెల నుంచి పెరిగిన పింఛన్ మొత్తాన్ని పొందవ చ్చు. అయితే, 80ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న పింఛనుదారుల అదనపు పెన్షన్ శాతంలో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారికి ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారమే పెన్షన్ అందుతుంది. చాలా కాలంగా ఏపీ పెన్షనర్ల సంఘాలు తమ అదనపు పింఛన్ రేట్లను పెంచాలని గవర్నమెంట్‌ని కోరుతున్నాయి. వారి వినతులను పరిశీలించిన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఫించన్ల పెంపు తమకు ఆర్థికం గా మరింత ఆసరాగా నిలుస్తుందని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్య ఫించన్లు/ఎన్టీఆర్ భరోసా లాంటి సామాజిక ఫించన్లు అందుకునే వారికి ఈ పెంపు వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుం బంలోని పెన్షనర్లకు వర్తిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్యామిలీ ఫించన్‌దారులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది.