ఒమేగా ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): విశాఖపట్నం లోని మెడిసిటీలో ఉన్న ఒమేగా హాస్పిటల్లో అరుదైన శస్త్రసికిత్స హాస్పిటల్ డాక్టర్స్ ఆధ్వర్యంలో జరిగింది. అచ్చుతా పురానికి చెందిన 60 ఏళ్ల మహిళ కడుపునొప్పి ఉబకాయ నొప్పితో అనకాపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరానికి వచ్చిన మహిళకి పరీక్షలు చేయగా 8 కిలోల గడ్డ ఉందని తేలింది. ఈక్రమంలో విశాఖ మెడిసిటీలోని ఒమేగా హాస్పటల్ డాక్టర్స్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద ఆమెకు శస్త్రచికిత్స నిర్వ హించి గడ్డను బయటికి తీసి ప్రాణాలు కాపాడ్డారు. అనం తరం ఒమేగా ఆస్పత్రి డాక్టర్స్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరికైనా కడుపులో ఎటువంటి గడ్డలు గాని, ఇటువంటి అవరోధాలు ఉన్న ఒమేగా ఆస్పటల్ సంప్ర దించాలని కోరారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద సస్త్ర చికిత్సలు చేస్తామని తెలిపారు. సమావేశంలో డాక్టర్ ముర ళీధర్, డాక్టర్ శ్రీహర్ష, డాక్టర్ శృతి, అనస్తీస్య డాక్టర్ విజయ కుమార్ పాల్గొన్నారు.