వీధి లైట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
5వ వార్డు కార్పొరేట్ మొల్లి హేమలత
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ 5వ వార్డ్ పరిధిలో వీధిలైట్లు లేక, వెలగక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడు తున్నారని, నగర శివారు ప్రాంతాలు అయిన కొండవాలు ప్రాంతాలలో చాలా చోట్ల కరెంట్ స్తంబాలకు వీధి దీపాలు లేక ప్రజలు రాత్రి సమయాల్లో చాలా అవస్థలు పడుతు న్నారని, కొత్త విద్యుత్ స్తంభాలకు వార్డు మొత్తంగా దాదాపు 70 వాట్స్ లైట్లు: 80, 40 వాట్స్ లైట్లు: 30,20 వాట్స్ లైట్లు: 200 అమర్చవలసి ఉందని వివరించారు. సంబంధిత అధి కారులను ఆదేశించి త్వరితగతిన వీధిదీపాలు మంజూరు చేసి ప్రతీ స్తంభానికి వీధి దీపాలు అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్‌కుమార్‌ను కార్పొరేటర్ మొల్లి హేమలత కోరారు. పి.పి-1, పి.పి-2, ఎన్టీఆర్ హుద్ హుద్ కాలనీ, మారిక వలస జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీ, వైఎస్సార్ కాలనీ, రాజీవ్ గృహకల్ప కానీలలోని ప్రధాన కూడళ్లలో ప్రజల రాకపోకలకు అనువుగా ఐదు రింగ్ పోల్ విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. 5వ వార్డు అభివృద్ధికి తోడ్పడా లని కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు.