ఏపీయూడబ్ల్యుజే పరవాడ ప్రెస్‌క్లబ్ కార్యవర్గం ఎన్నిక
కఅధ్యక్షుడిగా సీహెచ్ లోకేష్, ప్రధాన కార్యదర్శిగా కె.శివాజీ
అక్షర కిరణం, (పరవాడ): ఏపీయూడబ్ల్యూజే పరవాడ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం లంకెలపాలెంలోని షవర్ మినొస్ రెస్టారెంట్లో జిల్లా బాడీ సమక్షంలో జరిగింది. ప్రెస్‌క్లబ్ అధ్యక్షులుగా సీహెచ్ లోకేష్, ప్రధాన కార్యదర్శిగా కే శివాజీని సభ్యులు ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా రవికుమార్, ఉపాధ్యక్షు లుగా కే విశ్వనాథం, కోశాధికారిగా ఎం.అప్పలరాజు, సహా య కార్యదర్శిగా యు చంద్రశేఖర్, సభ్యులుగా కె.జగదీష్, పైల నాగరాజు, వి.సురేష్, పి.మోహన్, ఐ.సంతోష్, ఆర్.రాము ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సమావేశానికి ముందు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఏం. రాంబాబు, జిల్లా గౌరవ ప్రతినిధి స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కే చంద్రరావు, జిల్లా అధ్యక్షులు జోగి నాయుడు లను ప్రెస్‌క్లబ్ సభ్యులు పూలబొకెలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఏపీయూ డబ్ల్యూజే ప్రతినిధులు మాట్లాడుతూ యూనియన్ అభి వృద్ధికి, ప్రెస్‌క్లబ్ సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు. విలేఖరుల సంక్షేమానికి యూనియన్ కట్టుబడి ఉంటుందని, పాత్రికేయులకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. 60 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ యూనియన్ ఉద్యమ కార్యాచరణ రూపొందించిం దన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అనుబంధ స్థాని క సంఘాల ప్రతినిధులు ఎండీ రాజు, గణేష్, సభ్యులు ఈశ్వరరావు, రాధాకృష్ణ, ప్రేమ్, రామకృష్ణ, నాగేశ్వరరావు, సునీల్ జోషి తదితరులు పాల్గొన్నారు.