భారత రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం..
Åనింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం సక్సెస్
అక్షర కిరణం, (శ్రీహరికోట/జాతీయం): భారత అంతరిక్ష ప్రయాణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారి ప్రైవేటు రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా నింగిలోకి పంపింది. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్‌ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించింది. ‘మిషన్ ఆగమన’ పేరు తో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రయోగ కేంద్రం నుంచి బయలురేరిన రాకెట్.. 16 నిమిషాల్లోనే 450 కి.మీ. ఎత్తులోని నిర్దేశిత భూ కక్ష్యలోకి విక్రమ్-1 చేరింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాసిన వందేమాతరం కార్డును ఆర్బిట్‌లోకి పంపారు. దాదాపు నాలుగేళ్ల కిందట విక్రమ్-ఎస్ పేరుతో సబ్ ఆర్బిటాల్ రాకెట్‌ను స్కైరూట్ విజయవంతంగా పరీక్షించింది. విక్రమ్-1 లాంచ్ వెహికల్‌ను నవంబరు 2025లో స్కైరూట్ ఏరోస్పేస్ ఆవిష్కరించింది. భారత అంతరిక్ష పితా మహుడు విక్రమ్ సారాబాయ్ పేరు స్ఫూర్తితో ఈ రాకెట్‌కు విక్రమ్-1 అని పేరు పెట్టారు.
రోదసీలోకి ‘మోదీ పోస్ట్‌కార్డు’
మోదీ ‘వందేమాతరం’ పోస్ట్ కార్డుతో పాటు కాస్మోస్ డైమండ్స్ సంస్థకు చెందిన ‘కాస్మిక్ బ్లూమ’ ఆర్ట్‌వర్క్, సర్ సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ రూపాలను విక్రమ్-1 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ స్కైరూట్ శాస్త్రవేత్తల బృందం, ఇస్రో మాజీ ఛైర్మన్లు, సైంటిస్ట్‌లు, భారతీయ వ్యోమగాములు, ఇతరు లు పంపిన పోస్ట్‌కార్డులను సైతం ప్రత్యేక పేలోడ్ బాక్స్‌లో భద్రపరిచడం గమనార్హం. విక్రమ్-1 అనేది ఏడు అంతస్తుల మల్టీ-స్టేజ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. దీనిని పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో రూపొందిం చారు. అలాగే, స్కైరూట్ సొంతంగా అభివృద్ధి చేసిన 3ణ-ప్రింటెడ్ ఇంజన్లు, అత్యంత శక్తివంతమైన సాలిడ్-ఫ్యూయల్ బూస్టర్లతో కూడిన ప్రొపల్షన్ సిస్టమ్స్ దీనికి శక్తిని అందిస్తాయి. 350 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి దిగువ కక్ష్యలోకి మోసుకెళ్లేలా దీనిని రూపొందించారు. దీని మొదటి పరీక్షా ప్రయోగంలో భాగంగా, 60-డిగ్రీల వాలులో 450 కిలోమీటర్ల కక్ష్యను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్కైరూట్ ప్రస్థానం
ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్‌లు సంయుక్తంగా 2018లో స్కైరూట్ ఏరోస్పేస్ను స్థాపించారు. ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. చిన్న ఉపగ్రహాలను అతి తక్కువ ఖర్చుతో.. చాలా వేగంగా రోదసీలోకి పంపేందుకు నమ్మకమైన లాంచింగ్ వెహికల్స్‌ను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబరు 2020లో భారత్ మొట్టమొదటిసారిగా ఓ ప్రయివేట్ సంస్థ తయారుచేసిన ఘన ఇంధన రాకెట్ మోటార్ ‘కలాం-5’ను విజయవంతంగా పరీక్షించింది. తర్వాత నవంబరు 2021లో పూర్తి త్రీడి ప్రింటెడ్, క్రయోజెనిక్ లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఇంజిన్ ‘ధావన్-1’ను విజయవంతంగా పరీక్షించింది.
స్కైరూట్ ప్రస్థానంలోనే కాకుండా భారత రోదసీ చరిత్రలోనే 18 నవంబర్ 2022 ఒక మైలురాయిగా నిలిచిపోయింది. శ్రీహరికోటలోని ఇస్రో లాంచ్ ప్యాడ్ నుంచి ‘విక్రమ్-ఎస’ (Vఱkతీaఎ-S) అనే సబ్-ఆర్బిటాల్ రాకెట్‌ను స్కైరూట్ విజయవంతంగా ప్రయోగించింది. దీంతో అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపిన భారత మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగానికి ‘ప్రారంభ’ అని నామకరణం చేశారు.